పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప: ది రైజ్’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు నిర్వాహకులు. అనంతరం అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుష్ప-3 కూడా ఉండొచ్చు. మేము పుష్పని ఒక ఫ్రాంచైజ్‌లా చేయాలనే ఆలోచన ఉంది’ అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
