- సొమ్మొకడిది సోకొకడిది
- గిరిజనుడు పేరు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్న సిండికేట్లు.
- పల్లెల్లో రెచ్చిపోతున్న సిండికేట్ దందా.
- సుక్క తాగుదామంటే చుక్కలు చూపిస్తున్న వైన్స్ యాజమాన్యం.
- ఎమ్మార్పీ కంటే 60 రూపాయలు అదనంగా విక్రయాలు.
- పాత్రికేయులు ప్రశ్నిస్తే కెమెరాకు ఫోజులిస్తున్న పరిస్థితులు.
- జాడలేని ఎక్సైజ్ శాఖ అధికారులు.
- ఇదే అదనుగా
- యదేచ్చగా విక్రయాలు.
మన్యం న్యూస్ నూగుర్ వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో చిలకమ్మ వైన్స్, శివశక్తి వైన్ షాపుల దందా రోజు రోజుకు అధికమైపోతుంన్నాయి గిరిజనుడు పేరుతో వచ్చిన వైన్ షాపులు. గిరిజనేతరుల చేతులకు వెళ్లిపోయాయి. ఈ రెండు వైన్ షాపులు గతంలో బీ ఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక నాయకుడు ఆధీనంలో ఉన్నట్టు పలు ఆరోపణలు కూడా ఉన్నాయి పేరుకే గిరిజనుడు,పూర్తి వ్యవహారమంతా బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఒక నేత చేతిలోనే ఉన్నట్టు మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మండలంలో సిండికేట్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా యదేచ్చగా సాగుతున్నాయని,మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
పైకి శ్రీరామ నీతులు చెబుతున్న వైన్ షాప్ యాజమాన్యాలు, మొత్తం సరు కoత్త బెల్ట్ షాపులకు తరలించి ఇద్దరు 60 రూపాయలకు కోటరు అదనంగా అమ్మాలని ఒప్పందం కుదుర్చుకొని విక్రయాలు జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయని అ విషయము ఎవరికీ తెలియనట్టు గా మా వైన్ షాపులో ఎంఆర్పి ధరలకు ఇస్తున్నామని చాటింపు చేస్తున్నారంటూ వారు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. వైన్ షాప్ లో ఎమ్మార్పీ ధరలకే ఇస్తున్న మనీ చెప్పడానికి నాలుగు కోటర్లు నాలుగు బీర్లు రెండు ఫుల్ బాటిళ్లు చూపడానికి కౌంటర్ ముందు పెట్టుకొని వారి దందాను ప్రశ్నించడానికి వచ్చిన వారికి ఎంఆర్పికే అమ్ముతున్నాము అన్న విధంగా కలరింగ్ ఇస్తూ బెల్ట్ షాపులకు ఇచ్చిన సరుకుని మాత్రం 60 రూపాయలు అదనంగా అమ్ముతునా, దాన్ని కప్పి పెట్ట డానికి వారు వేసే ఎత్తుగడలు రామాయణంలో శకుని కి కూడా రాని విధంగా పైఎత్తులు వేస్తున్న పరిస్థితులు అబ్బురపరుస్తున్నాయి అంటూ మండల ప్రజలు వాపోతున్నారు. వైన్ షాప్ దగ్గర కంటే బెల్ట్ షాపులలోనే మందుబాబులు మందును కొనక తప్పడం లేదు, అని ఉన్న బ్రాండ్లన్నీ బెల్ట్ షాపులకు ఇచ్చేసి నాలుగైదు బ్రాండ్లను వైన్ షాపులో విక్రయించే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటూ మందు బాబులకు వారికి కావలసిన కోటర్ వైన్ షాపులో దొరకపోవడంతో బెల్టు షాపును ఆశ్రయిస్తూ ఎక్కువ డబ్బులు చెల్లించుకొని కోటర్ తాగవలసిన పరిస్థితులు వస్తున్నాయంటూ పలువురు వైన్ షాప్ యాజమాన్యాలపై విమర్శిస్తున్నారు,
పేదోని జేబు చిల్లు పడేయడమే ధ్యేయంగా క్వార్టర్ మీద 60 రూపాయలు అదనంగా విక్రయించే వారిని ఆపడానికి ఎక్సైజ్ అధికారుల జాడ కూడా మండలంలో కరువై గాలికి నిప్పుతోడైనట్టుగా వారి నిర్లక్ష్యం వీరి విక్రయాలకు పచ్చ జెండా ఊపినంత ఉత్సాహం ఇస్తుంది అంటూ తద్వారా వారి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మందుబాబులు ఆరోపిస్తున్నారు.
రోజు కు 300 సంపాదించే మాకు సాయంత్రం పని దిగి చుక్క తాగుదాం అనుకుంటే ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ
వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ అధిక ధరల సిండికేట్ల దందాపై చర్యలు తీసుకొని సగటు కూలి వాడు సేవించే విధంగా మద్యానికి ధరలు దిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.