మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ముస్కె వెంకన్న మాధవి వీరికి ఇద్దరు సంతానం వారిలో చిన్న బాబు గ్రేస్మంత్, పెద్ద బాబు రాహుల్, వీరిది చాలా పేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వీరిది కొన్నిరోజుల క్రితం గోదావరి స్నానం నిమిత్తం వెళ్లిన చిన్న కుమారుడు గ్రేస్మంత్ (14) లోతుల్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడు. వారి పరిస్థితి తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి మేమున్నాం అంటూ 3 వేల రూపాయలు ఆర్ధిక సహాయం తో పాటు 25 కేజీ ల బియ్యం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ గౌరవసలహదారులు కొలగట్ల నరేష్ రెడ్డి ఈక రాజేష్ , ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,ప్రధానకార్యదర్శి మునిగల రాకేష్ కార్యవర్గసభ్యులు గోలి నరేష్,ఓదెల సుధీర్,ఎం డి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.