మన్యం న్యూస్,మంగపేట
ఆదివారం మంగపేట మండల రమణక్కపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కా వెంకటేశ్వర్లు కొడుకు ముష్కా గ్రేస్మoత్ ఇటీవలే ప్రమాదవశాత్తు గోదావరి లో పడి మృతి చెందగా, దశ దిన కర్మలకు హాజరై అతని చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి ఇటువంటప్పుడు ధైర్యం కోల్పోవద్దు అని అన్నివేళలా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది,ఏ సమయంలో అయినా మీకు అన్నివేళలా నేను తోడుంటానని భరోసా నిచ్చి, ఆర్ధిక సహాయం అందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరి,పార్లమెంట్ ఎన్నికల యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ ధనసరి సూర్య.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.