- ఇంటిలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మృతి
- కానిస్టేబుల్ కాదు ఒక యోధుడు అంటూ ప్రశంసలు.
- ఉద్యోగమే పరమవదిగా జీవనం సాగించిన మన్యం బిడ్డ.
మన్యం న్యూస్ వాజేడు.
వాజేడు మండల కేంద్రం గొల్లగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోడెం కోటేశ్వరరావు(40 ) కానిస్టేబుల్ ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. మార్నింగ్ షిఫ్ట్ ముగించుకొని సాయంకాలo తన షిఫ్ట్ రాగానే విధులలో జాయిన్ అవ్వడానికి తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యూటర్న్ తీసుకోవడానికి మలుపు తిప్పుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చి ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. వెంటనే స్థానికులు స్పందించి దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలకు తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు.. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిదొక మారుమూల గ్రామం పెద్ద గొల్లగూడెం. ఎంతో గొప్పగా చదువులు చదువుకొని తిని తినక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే మొండిపట్టుతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి , ఆ విధుల్లో కూడా ఉన్నత అధికారుల మనలలను పొంది, డ్యూటీయే పరమావధిగా ప్రజల నుండి పోలీసు అధికారుల వరకు ప్రశంసలు పొందిన వ్యక్తి. అని తన వీడ్కోలు యాత్రకు వచ్చిన పోలీసులు చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బంధుమిత్రులు తండోపతండాలుగా తన భౌతిక కాయాన్ని చూడడానికి హాజరయ్యారు. గతంలో వెంకటాపురం మండలంలో నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించి, అనంతరం బదిలీలపై జిల్లా ఎస్పీ కార్యాలయం ఇంటిలిజెంట్ విభాగంలో, విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయన అంతిమయాత్రకు జిల్లా అధికారులు తన స్వగృహానికి చేరుకుని కోటి కానిస్టేబుల్ కు చివరి వీడ్కోలు తెలిపారు . ఈ చివరి వీడ్కోలు కు గతంలో వెంకటాపురంలో విధులు నిర్వహించిన సీఐ తిరుపతి, వెంకటాపురం ఎస్ఐ అశోక్, కోటేశ్వరరావు సహచరులు పాల్గొని చివరి వీడ్కోలు యాత్ర ఘట్టాన్ని ముగించారు.