తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. పార్టీ తొలి సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చెన్నై శివారులోని పణయూర్‌లోని పార్టీ కార్యాలయాన్ని వేదికగా ఫిక్స్ చేశారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. విజయ్ దూకుడుతో ప్రధాన పార్టీల్లో అలజడి మొదలైంది.
