ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోనున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఐశ్వర్య సోదరి అదితి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేశారు. అయితే ఐశ్వర్య 2021లో క్రికెటర్ రోహిత్ దామోదరన్ ని వివాహం చేసుకున్నారు. విభేదాల కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారు.
