తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ‘నా సామిరంగా’ ఫేం ఆషికా రంగనాథ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆషికా.. బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా విడుదల అయిన అమిగోస్ చిత్రంతో ఆషికా రంగనాథ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. కాగా ఆలయం బయటకు వచ్చిన ఆషికాతో పలువురు భక్తులు సెల్ఫీలు దిగారు.
