టాలీవుడ్ సింగర్ గీతా మాధురి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 10న తనకు కుమారుడు పుట్టాడని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గీతా మాధురి పేర్కొన్నారు. విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతా మాధురి, హీరో నందు 2014లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2019లో దాక్షాయణి ప్రకృతి జన్మించింది.
