టాలీవుడ్ హీరో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు ఆమెకు యోగా టీచర్ గా పనిచేసిన రూహీతో చివరిగా చాట్ చేసిన మిసేజ్ ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ‘ఇది రూహీ నుండి నా చివరి సందేశం. తన ముఖంలో ఎప్పుడూ ఎలాంటి కల్మషం లేని నవ్వుతో కనిపిస్తూ ఉండేది. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను’ అని రాసుకొచ్చారు.
