మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా హిందూ ధర్మ రక్షణ సభ్యులు ఘనంగా నిర్వహించారు. చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాసారపు రవి, మానాల శ్రవణ్ కుమార్, యాసారపు సురేష్, టి సురేష్, గడ్డం సాయి, తీగల ముఖేష్, పిల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు
