మన్యం న్యూస్ గుండాల: సాయన పల్లి పంచాయతీ కార్మికులు విధి నిర్వహణలో మరణించినప్పటికీ ప్రభుత్వము నుండి ఎటువంటి హామీ దొరకలేదని డిఎస్పి జిల్లా నాయకులు నవజీవన్ సామ్రాట్ అన్నారు. సోమవారం కొత్తగూడెం లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అధికారులకు రామ్మూర్తి కుటుంబ దుస్థితిని వారికి వివరించారు. రామ్మూర్తి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతుందని గ్రామపంచాయతీ ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ లేకపోవడంతో భీమా పరిహారం కూడా రావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రామ్మూర్తి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రీవెన్స్ డే లో రామ్మూర్తి కుటుంబం వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ నాయకులు రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు