- ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు టిన్ షెల్టర్ ప్రారంభం.
- వలస ఆదివాసీ గ్రామలలో విద్యా,ఆరోగ్యానికి మా సంస్థ సేవా కార్యక్రమాలు వ్యవస్థాపకులు తోలెం.రమేష్
మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతిలోగల అంగోరుగూడెం(వలస ఆదివాసీ) గ్రామంలోని మండల పరిషత్ ప్రధామిక పాఠశాలకు గోల్డ్ క్లాప్ సహకారంతో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో టిన్ షెల్టర్ నిర్మాణం చేపట్టారు.ఈ సందర్భంగా ఆధార్ స్వచ్చంద సంస్థ వ్యవస్థపాకులు తోలెం.రమేష్ మాట్లాడుతూ వలస ఆదివాసీ గ్రామాలలో కనిషం విద్య,వైద్యం లేక వలస ఆదివాసులైన గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి రావడంతో గోల్డ్ వారి సహకారంతో అంగోరుగూడెం గ్రామంలో నూతనంగా అంగన్ వాడీ, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలకు టీన్ షెల్టర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే పిల్లలు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు పిల్లలను ప్రతిరోజు సక్రమంగా పాఠశాలకు పంపించే విధంగా తల్లిదండ్రులు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ పి.పోలెబోయిన. సాంబశివరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుమలరావు, అంగన్‌వాడీ టీచర్ తోలెం.రవింద్ర,ఆధార్ స్వచ్చంద సంస్థ సభ్యులు, మన్యం న్యూస్ రిపోర్టర్ బట్టా.బిక్షపతి,గ్రామస్తులు మడకం.నందయ్య,కలం.భీమయ్య,కుంజా.రాము పాల్గొన్నారు.