విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై, ఆగిపోయిన సంఘటనపై ఎదురైన ప్రశ్నకు విశ్వక్ స్పందించారు. ’’నేను సినిమాని క్యాన్సిల్ చేయమని చెప్పలేదు. ఒక్కరోజు షూటింగ్ ఆపమన్నానంతే. దానికే ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకున్న పారితోషికానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశా. ఆయన కోపంలో చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే’’ అని విశ్వక్‌సేన్ అన్నారు.
