బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ జాన్వీకపూర్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బామా ఎన్టీఆర్‌కు జోడీగా ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా బ్యూటీ మరో తెలుగు టాప్ హీరోకు జోడీగా నటించేందుకు ఒకే చెప్పిందట. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోవు ‘ఆర్‌సీ16’లో జాన్వి చేస్తోందని టాక్. ఈ విషయాన్ని జాన్వీకపూర్ తండ్రి బోనీకపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
