బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణెకి అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్ లో జరిగిన 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దీపిక ప్రజెంటర్ గా వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి దీపిక. సబ్యసాచి చీరలో వేదికపై ఆమె మెరిసిపోయారు.
