‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ హీరోయిన్ త్రిష, చిరుతో జత కడుతోంది. ఈ సినిమాలో ఊర్వశీ రౌటేలా ఓ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. గతంలో చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఊర్వశీ రౌటేలా స్టెప్పులు వేసింది.
