హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల వివాహం గతేడాది నవంబర్ లో ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇటలీలో పెళ్లి జరగడానికి గల కారణాలను వరుణ్ తేజ్ తాజాగా వెల్లడించారు. ‘నా కుటుంబం చాలా పెద్దది. ఇక్కడ వివాహం జరిగితే వేడుకను వాళ్లు పూర్తిగా ఆస్వాదించలేదు. అందుకే ఇటలీలో వివాహం చేసుకోవాలని నిర్ణయించాం. కేవలం 100 మందినే ఆహ్వానించాం. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా గడిపారు’ అని తెలిపారు.
