సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ అల్లుడిగా తెలుగు హీరోగా పరిచయమైన సుధీర్ విభిన్న పాత్రలతో కూడిన సినిమాలు చేస్తూ తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పెళ్లి చూపులకు ముందు రోజు పేపర్ లో ఒక ఫొటో వచ్చింది. అందులో ప్రియదర్శిని చాలా లావుగా ఉంది. దాంతో ఆ పిక్ చూసి భయపడిపోయానన్నారు. అమ్మాయి బావుందని చెప్పడంతో పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
