రైతుల ఢిల్లీ ఛలో నిరసన కార్యక్రమంపై పంజాబ్ & హరియాణా హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది. నిరసనలో ట్రాక్టర్ ట్రాలీలను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకుంటే ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అదే సమయంలో రైతులను గుమిగూడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని పంజాబ్ ప్రభుత్వం ప్రశ్నించింది
