- చల్లంగా చూడమ్మ సమ్మక్క తల్లి.
- నేడు వనం నుంచి జనంలోకి వనదేవతలు
- సమ్మక-సారక్క జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనండి. మాజీ సర్పంచ్ పాయం నరసింహారావు
మన్యం న్యూస్ కరకగూడెం: ఆదివాసి సంప్రదాయాలతో ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర. కరకగూడెం మండలం చిర్రమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని కొంగల చెరువు గుట్టమీద సమ్మక్క సారలమ్మ జాతరను మంగళవారం ఆదివాసీలు పూజలు మండ మెలుగు కార్యక్రమంతో ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు ముత్యాలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. బుధవారం ఒక్కపొద్దు లో ఉండి కన్నాయిగూడెం నుంచి ఆంజనేయ,పగిడిద్దరాజు, ధూళిముత్తి,పడగలు, ఆదివాసి సంప్రదాయాలతో గుడికి చేర్చారు. ఆలయ పూజారి ఆలయ కమిటీ సభ్యులు చిరుమళ్ళ గ్రామం వద్ద ఎదురుకోలు ఎదుర్కొని పడగలను ఆదివాసి నృత్యాలతో డప్పు వాయిద్యాలతో గుడికి చేరుకున్నారు. నేడు గురువారం నాడు వనదేవలతలు వనం నుండి జనంలోకి ప్రవేశించి వనదేవాతలు ఎదురు కోలుగా తిసుకోని గుడినిండుకుంటుంది అని అలాయ పూజారి చందా రామరావు,మాజీ సర్పంచ్ పాయం.నర్సింహరావు తెలిపారు.