- ఎస్సీ కార్పోరేషన్ లో ఎన్ఎస్ఎప్ గోగు.సుధాకర్ కి అవకాశం కల్పించాలి.
- నేతకాని స్టూడెంట్ పేడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్
మన్యం న్యూస్ కరకగూడెం: నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోగు సుధాకర్ కి ఎస్సీ కార్పొరేషన్ లో అవకాశం కల్పించాలని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గత కొన్ని సంవత్సరాలు అవుతున్న ఎస్సీ కులస్తులను గుర్తించకపోవడం దారుణం అన్నారు.రాష్ట్రంలో నేతకాని కులస్తులు లక్షల జనాభా ఉన్నందున హతకాని సమాజాన్ని గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ లో నామినేటెడ్ పదవి ఎస్సి కులస్తులకు ఇవ్వాలని ఆయన అన్నారు.మాల మాదిగల తో పాటు మా సమాజాన్ని గుర్తించాలని ఆ సమాజంలో రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గోగు సుధాకర్ చాలా సంవత్సరాలు కాలం తెలంగాణ ఉద్యమంలో పని చేశారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి మా కులస్తులను గుర్తించాలని అన్నారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోగు. శ్రీను,దుర్గం.సందీప్, సురేందర్,ప్రసాద్, జిమ్మిడి. రాహుల్ పాల్గొన్నారు.