మన్యం న్యూస్ చర్ల
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా బుధవారం గురుదేవ్ విద్యాలయం చర్ల యందు శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన తెలుగుభాష శతక పద్యార్చన ఘనంగా నిర్వహించ బడింది. ఈ కార్యక్రమం బొల్లారగుడెం ఉన్నత పాఠశాల తెలుగు భాషా ఉపాధ్యాయులు మామిడి రమేష్ మార్గ దర్శకత్వము లో , ప్రధానోపాధ్యాయులు హెచ్. గిరి వెంకట ప్రసాద్ అకడమిక్ -కో -ఆర్డినేటర్ ఎమ్. వి. సుబ్రమణ్యం ప్రోత్సాహం తో, తెలుగు ఉపాధ్యాయులు ఎస్. విశాల, ఎం.విజయ రాణి, శ్రీమతి ఏ. హేమలత, కుమారి పి.సంధ్య, కె. నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణ లో 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు 110 మంది విద్యార్థులు 101 పద్యాలను కేవలం 16 నిమిషాల వ్యవధిలో పద్యార్చన చేసి అత్యద్భుతమైన ప్రదర్శన చేశారు. దీనికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఛైర్మన్ చింతపట్ల వెంకటాచారి, గుజ్జారి శ్రీధర్ గారు ప్రత్యేక శ్రద్ధ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి వచ్చిన పర్యవేక్షకులు వడుగు నాగ పద్మిని విద్యార్ధులను ప్రశంసిస్తూ గురుదేవ్ విద్యార్థులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందినట్లు గా ప్రకటించారు. గుంపుల యశ్వంత్, దంగేటి సురేంద్ర మాట్లాడుతూ… గురు దేవ్ పాఠశాల లో విద్య తో పాటు విద్యార్థుల్లో ప్రతిభ ను వెలికి తీసేలా తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ప్రశంసిస్తూ , తెలుగు భాష శతకాన్ని ఇంత అర్థవంతం గా పాడిన విద్యార్థినీ విద్యార్ధులను అభినందించారు. మండలం ఎం.ఈ. ఓ ఝుంకీ లాల్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్ధులను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరి వెంకట ప్రసాద్ విద్యార్థినీ విద్యార్ధులను అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన డాక్టర్ రాంబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.