హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. జాకీ భగ్నానీని ఆమె వివాహమాడారు. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయాల్లో రకుల్-జాకీ వివాహం జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లి ఫొటోలు బయటకి వచ్చాయి. కొత్త జంటకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.
