యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. నిఖిల్ ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం ‘స్వయంభూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
