UPDATES  

 141 బిఎన్, సి ఆర్ పి ఎఫ్ భద్రత బలగాల ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ క్రీడలు..

 

మన్యం న్యూస్ చర్ల:

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం 141 బీఎన్, సిఆర్పిఎఫ్ భద్రత బలగాలు ఆధ్వర్యంలో బుధవారం సబ్ యూనియన్ అథ్లెటిక్స్ అనగా రన్నింగ్, జావలింగ్ త్రో, డిస్క్ త్రో, షాట్ పుట్, లాంగ్ జంప్ వంటి ఆథెటిక్స్ క్రీడలు మండల లోని పలు కళాశాలలు, పాఠశాల స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ క్రీడల్లో జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చర్ల, జడ్పీఎస్ఎస్ సత్యనారాయణపురం, రాహుల్ విజ్ఞాన్ హై స్కూల్, ఏ హెచ్ ఎస్ పుంజుపల్లి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిన్నమిదిసిలేరు, కేజీబీవీ కళాశాల చర్ల వంటి స్కూల్స్ పాల్గొనడం జరిగింది.ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు పలు ఈవెంట్స్ లో విజేతలుగా నిలిచారు. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో రోహిత్ రావు, శివ కృష్ణ , లక్ష్మి సాగర్ నిలిచారు. 200 మీటర్ల పరుగు పందెంలో మొదటి, ద్వితీయ స్థానాలలో మనోహర్, కృష్ణ చైతన్య నిలిచారు. షాట్ పుట్ విభాగంలో వై. రేవంత్ మూడవ స్థానంలో నిలిచాడు. లాంగ్ జంప్ విభాగంలో వై. రేవంత్ మూడో స్థానంలో నిలిచాడు. జావేలిన్ త్రో విభాగంలో శివకృష్ణ మూడవ స్థానంలో నిలిచాడు. డిస్క్ త్రో విభాగంలో శివకృష్ణ మూడవ స్థానంలో నిలిచాడు. వీరికి సిఆర్పిఎఫ్ 141వ బెటాలియన్ ఎస్ .పి. రితేష్ ఠాకూర్ బహుమతులు ప్రధానం చేశారు. విజేతలు అందరికీ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డి.ఎన్. కుమార్ , ప్రతిభ, ఈ.డి.శాస్త్రి , ప్రిన్సిపల్ జి.వర్మ రాజు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు 141 బి ఎన్ సిఆర్పిఎఫ్ కమాండర్ రితేష్ కుమార్ విజేతలకు సర్టిఫికెట్లతో పాటుగా ట్రోపీలు అందజేస్తూ వారితో సంభాషించారు. అదేవిధంగా సివిల్ యాక్షన్ ప్రోగ్రాం గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో సి. ప్రీత సెకండ్ కమాండర్, రాజ్ కుమార్ అసిస్టెంట్ కమాండర్, 141 బి ఎన్, సిఆర్పిఎఫ్ అధికారులు, సీఐ ఏ,రాజువర్మ, ఎస్సైలు టివిఆర్ సూరి, ఆర్ నర్సిరెడ్డి,అన్ని పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !