పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుణ్ ఈ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులకు వరుణ్ నివాళులు అర్పించి, వారి కుటుంబాలను మర్యాదపూర్వకంగా కలిశారు.
