భాషతో సంబంధం లేకుండా వరుస మూవీ అవకాశాలతో దూసుకెళ్తోంది నటి మృణాల్ ఠాకూర్. ఆమె కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న వింత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. కెరీర్ ఆరంభంలో ఓ సినిమా ఆడిషన్‌కి వెళ్ళినపుడు దర్శకుడు పాత్ర గురించి ఏం చెబుతున్నారో అర్థం కాలేదని, లుక్ టెస్ట్‌లో కూడా వింత అనుభవం ఎదురయ్యిందని తెలిపింది. అలాగే కొందరు తనని బరువు తగ్గితే బాగుంటుందని చెప్పారని, కానీ తెరపై సహజంగా కనిపించడానికే ఇష్టపడతానని ఆమె తెలిపింది
