బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. ఆమెపై దాఖలైన లుక్ అవుట్ నోటీసులను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఆమె సోదరుడు షౌమిక్, తండ్రి ఇంద్రజిత్పై ఉన్న నోటీసులను కూడా రద్దు చేసింది. దీంతో వీరు విదేశాలు ప్రయాణించేందుకు అడ్డుతొలగినట్లు అయింది. కాగా, గతంలో సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో వీరిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
