UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 డైరెక్టర్ శంకర్ క్రాస్ చేసి టాప్‌లో కి రాజమౌళి

ఒకప్పుడు సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా శంకర్ ఉండే వారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి సౌత్ ప్రేక్షకులు గర్వపడేలా చేశారు. ఇక ఇప్పుడు ఆయననని క్రాస్ చేసి రాజమౌళి టాప్‌లో నిలిచాడు. వరుస విజయాలతో అద్భుతమైన సినిమాలు చేస్తున్న రాజమౌళి ఉన్నత స్థాయికి చేరుకున్నీడు. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 జపాన్ లో ఆదరణ దక్కించుకున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. ఇక జక్కన్న నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ మహేష్ )తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌ రేంజ్‌లో అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు దర్శకధీరుడు.

ప్రపంచ సాహసికుడి నేపథ్యంలో కథ సాగుతుందని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. ఆఫ్రీకా అడవుల బ్యాక్‌ డ్రాప్‌లో కథ ఉంటుందని రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ కూడా చెప్పారు. ఈ సినిమా చరిత్రని తిరగరాయనుందని అంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసమని జపాన్ వెళ్లిన రాజమౌళి.. ప్రత్యేకంగా ఓ గేమింగ్ స్టూడియోకి వెళ్లారు. మెటల్ గేర్ లాంటి అద్భుతమైన వీడియో గేమ్ ని సృష్టించిన హిడియోం కొజిమాని కలిసేందుకు స్టూడియోకి వెళ్లారు రాజమౌళి.

అక్కడ రాజమౌళి బాడీ మొత్తాన్ని రకరకాల కెమెరాలతో స్కాన్ చేశారు హిడియో కోజిమా. క్రేజ్ పెరుగుతూ పోతుంది… RRR పాత్రలతో ఓ గేమ్ ని ఏదైనా సిద్ధం చేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది. అందుకే రాజమౌళి బాడీని స్కాన్ చేసి ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి హిడియో కోజిమా స్టూడియోలో కెమెరాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్.ఆర్.ఆర్ గేం వస్తే మాత్రం తప్పకుండా అది సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు.

అయితే ఆ గేమ్ లో రాజమౌళి కూడా ఉంటాడు కాబట్టే ఆయన బాడీని స్కాన్ చేసి ఉంటారని చెబుతున్నారు. ఇలాంటి అవకాశం ఎప్పుడు శంకర్‌కి దక్కలేదనే చెప్పాలి. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి జపాన్ వెళ్లిన ఎన్.టి.ఆర్ రాం చరణ్ లకు అక్కడ ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. వారు మన హీరోలని చాలా ఆప్యాయంగా పలకరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !