ప్రపంచవ్యాప్తంగా 5G స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ క్రమంగా 5Gకి షిఫ్ట్ అవుతుంది. దీంతో 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 5G స్మార్ట్ఫోన్ల సరఫరా 200 కోట్ల యూనిట్లను అధిగమించిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. యాపిల్, శామ్సంగ్ కంపెనీలు కలిసి అత్యధికంగా 100 కోట్లకు పైగా 5G స్మార్ట్ఫోన్లను సరఫరా చేసినట్లు పేర్కొంది.