అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటకలోని డా. హిరేమఠ ఫౌండేషన్, రాష్ట్ర సనాతన ధర్మ రక్షణ వేదిక సంయుక్తంగా అరుణ్ యోగిరాజ్‌కు ‘అభినవ అమర శిల్పి’ అనే బిరుదును ప్రకటించింది. కాగా, అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు మొత్తం 3 రాముడి విగ్రహాలను రామజన్మభూమి ట్రస్ట్ చెక్కించింది. ఆ మూడింటికి ఓటింగ్ నిర్వహించి.. యోగిరాజ్ చేసిన విగ్రహాన్ని ఎంపిక చేశారు