మన్యం న్యూస్, దమ్మపేట, ఫిబ్రవరి, 24: ఈనెల 26వ తేదీన దమ్మపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని అశ్వరావుపేట నియోజకవర్గ ప్రముఖ్ కార్గిల్ గాదె రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతుందని ఈ సభకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిలు యాత్రలో పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. ఈ సభకు దమ్మపేట మండలంలో ప్రజలను సభా ప్రాంగణానికి తీసుకురావడానికి ముఖ్యమైన బాధ్యులుగా గొట్టి పూళ్ళ శ్రీనివాసరావు, పల్లపు వెంకీ లను నియమించడం జరిగిందని, ముష్టిబండ గ్రామం నుండి జన సమీకరణకు కొలిక పోగు ముసలయ్యను, జగ్గారం పట్వారి గూడెం ప్రాంతాల నుండి జన సమీకరణకు జిల్లా ప్రధాన కార్యదర్శి మడివి రవి, ప్రసాదులను, నాగుపల్లి, నాచారం గ్రామాల నుండి జన సమీకరణకు ముత్యాలరావును, చండ్రుగొండ మండలం నుండి ఆ మండల అధ్యక్షులకు, అన్నపరెడ్డిపల్లి, ములకలపల్లి, అశ్వరావుపేట ప్రాంతాల నుండి జన సమీకరణకు ఆయా మండలాల బాధ్యులు బాధ్యత తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మడివి రవి మాట్లాడుతూ 500 ఏళ్ల నుండి ఎన్నో పోరాటాలు జరిగినప్పటికీ అయోధ్యలో రామాలయం నిర్మించలేకపోయామని మన దేశ ప్రధాని మోడీ హయాంలో అంతటి ఘన విజయం సాధించామని ఆ బాల రాముని దర్శించడానికి ప్రజలు ప్రతి నిత్యం కోట్లాదిమంది వెళ్లి తరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొలికపోగు ముసలయ్య మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు రాష్ట్ర పార్టీ పెద్దలు పాల్గొనే ప్రజాసంకల్ప యాత్రకి అత్యధికంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను సీనియర్ నాయకులు ఉడుత నేను విశ్వేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు.