మన్యం న్యూస్, దమ్మపేట, ఫిబ్రవరి, 24: మండల కేంద్రంలో శనివారం ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తెలంగాణం దినపత్రిక జర్నలిస్టు శంకర్ మీద దాడి చేసినందుకు ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ ఎస్కే దస్తగీర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు వార్తలను రాసే జర్నలిస్టులు సామాజిక సేవకులని మా సేవను గుర్తించకపోయిన పర్వాలేదు గాని ఇలాంటి దుండగులు మా మీద దాడులు చేసినప్పుడు ప్రజాపౌరులందరూ ఖండించాలని ఆయన అన్నారు. ఈ విధంగా దాడి చేసిన వాళ్లని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని మరలా ఇటువంటి దుచ్చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. ఈ క్రమంలో మండల రెవెన్యూ ఆఫీస్ కి వెళ్లి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్బులు జర్నలిస్టులు పాల్గొన్నారు.