UPDATES  

 ఇది జర్నలిస్టుల జాతర..సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..!

  • ఇది జర్నలిస్టుల జాతర
  • సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..!
  • వన జాతరకు కోటి 45 లక్షల మంది హాజరు…
  • మేడారంలో మంత్రి సీతక్క ప్రెస్.

మన్యం న్యూస్, మంగపేట.

దాదాపు వారం రోజుల నుండి సమ్మక్క సారలమ్మ వైబవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిపిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు..

 

తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటింది

మీడియా మాత్రమే..

 

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర

 

నాలుగు రోజులలో 1కోటి45 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.

 

అమ్మవార్లను దర్శించు కోవడానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం ఈ ప్రాంత వాసులుగా మాకు గర్వకారణం..

 

జాతర నిర్వహణకు అత్యధికంగా నిధులు కేటాయించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు.

 

ప్రభుత్వం ఏర్పడిన 75 రోజులు సమయం లో 65 రోజులలో జాతర ఇర్వహనకు నిధులు మంజూరు చేయించి వరదల కారణంగా పూర్తిగా నష్టపోయినా మేడారం పరిసర ప్రాంతాలలో అన్ని మరమ్మత్తులు చేయించాం..

 

ఇరవై శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను సక్సస్ చేయడం జరిగింది..

 

క్యాబినెట్ లోని అన్ని శాఖల మంత్రులు జాతర నిర్వహణకు సహకరించారు..

 

ఆర్టీసీ సంస్థ ద్వారా మేడారం జాతరకు 10 వేల ట్రిప్పుల బస్సులు నడిచాయి.

13మంది వివిఐపిలు 150 మంది వీఐపీ లు అమ్మవార్లను దర్శించుకున్నారు.

 

ఇద్దరు భక్తులు ప్రమాద వశాత్తూ చనిపోవడం జరిగింది..

 

గతం తో పోలిస్తే ఈ జాతర చాలా మెరుగుగా జరిగింది..

 

అమ్మవార్ల వన ప్రవేశానికి వెళ్లే సమయం వచ్చినప్పటికీ ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతుంది..

 

జాతర లో ఏమైనా లోపాలు ఉంటే అధికారులతో రివ్యూ నిర్వహించి తిరుగువారం తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తాం..

 

మిసింగ్ క్యాంపుల ద్వారా 5090 మంది భక్తులు తప్పితే 5060 మంది తప్పిపోయిన భక్తులను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం జరిగింది.

ఇంకా 35 మంది మా దగ్గర ఉన్నారు..

 

జాతర పూర్తైన పది రోజుల వరకు కూడా పారిశుధ్యం పనులు కొనసాగుతుంటయి..

 

తక్కువ కాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

జాతర కు సహకరించిన పూజారులు,ఆదివాసీలు,అధికారులకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు…

 

జాతరలో ఏమైనా లోటు పాట్లు ఉంటే మినీ మేడారం జాతర సమయానికి శాశ్వత ప్రాతిపదికన పూర్తీ చేస్తాం…

 

ఈ ప్రాంత బిడ్డగా వచ్చే జాతరకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వం ద్వారా చర్యలు చేపడతాం..

 

బస్సుల సంఖ్య పెంచడం వల్ల బస్సులు కొన్ని సాంకేతిక లోపంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది..

 

కచ్చితంగా అందరి సూచనలు సలహాలు పాటిస్తాం వచ్చే జాతరలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూస్తాం..

 

అవసరమైతే శాశ్వత ప్రాతిపదికన క్యు లైన్ల లో టాయిలెట్లు, మాంచి నీరు ఏర్పాటు చేస్తాం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !