స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలికం ఆపరేటర్లకు చేసిన ప్రతిపాదనలు త్వరలోనే అమలుకు నోచుకోనున్నాయి. వినియోగదారుల అభ్యర్థిన మేరకు సప్లిమెంటరీ సర్వీస్‌గా అన్ని టెలికోలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అందించాలని ట్రాయ్ తన చివరి సిఫార్సుల సెట్‌లో ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వస్తే ఫోన్ చేసిన వారి వివరాలు స్క్రీన్ మీదే కనిపిస్తాయి.