బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆదివారం 30వ పుట్టిన రోజు వేడుక చేసుకున్న ఆమె వెరైటీగా బంగారు కేకు కోసింది. అవును. ఆ కేకు తయారీలో స్వచ్చమైన 24 క్యారట్ల బంగారం ఉపయోగించారు. ఇంతకు ఆ కేకు ఖరీదు ఎంతో తెలుసా.? అక్షరాల రూ.3 కోట్లు. ఊర్వశి బర్త్ డే సందర్భంగా ర్యాపర్ యోయో హనీ సింగ్ ఆ కేకును తెప్పించాడు. తన బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలను ఊర్వశి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
