ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-ది రూల్’ ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వారసుడు ‘అల్లు అయాన్’ నటించనున్నట్లు తెలుస్తోంది. అయాన్ కోసం ‘పుష్ప-2’లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే, ఈ వార్త పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
