కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న కారణంగా ’యానిమల్‘ సక్సెస్ ను ఆస్వాదించలేకపోయానని నటి రష్మిక అన్నారు. ’‘యానిమల్’ ఇంటర్వ్యూల్లోనూ, విజయోత్సవ వేడుకల్లోనూ పాల్గొనలేకపోయా. మీరు నన్ను మిస్ అవుతున్నారని నాకు తెలుసు. ఆ లోటును నేను నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులు భర్తీ చేస్తాయని భావిస్తున్నా. అవి మిమ్మల్ని విశేషంగా అలరిస్తాయి. మీరు వాటిని చూస్తూ ఎంజాయ్ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా‘ అని రష్మిక పేర్కొన్నారు.
