బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, తెలుగు హీరో ఎన్టీఆర్‌తో ‘దేవర’ మూవీలో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీలోనూ ఆమెకు అవకాశం దక్కింది. అయితే దేవర వంటి భారీ చిత్రంతో దక్షిణాదిన పరిచయం కావటం సంతోషంగా ఉందని జాన్వీ కపూర్ తెలిపింది. ఇక్కడ నటించటం ద్వారా తన మూలాలను చేరుకున్న భావన కలుగుతుందని చెప్పింది. తనకు సినిమా, క్రికెట్ అంటే ఇష్టమని.. క్రికెట్ ప్లేయర్స్‌లో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ ఇష్టమని పేర్కొంది.
