మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని వేపలగడ్డ గ్రామం నుండి ఈనెల 19వ తారీఖున మేడారం పయనమై వెళ్ళిన పగిడిద్దరాజు జాతర ముగియడంతో గుండాలకు పయనమై వచ్చాడు. అరెం వంశీయులు కాలినడకన పగిడిద్ద రాజు మేడారం నుండి వేపలగడ్డ వరకు తీసుకువచ్చారు. మండల కేంద్రంలో ప్రజలు నీళ్లు ఆరబోస్తూ స్వాగతం పలికారు. వడ్డే అరెం నాగయ్య ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాడు. మార్చి మొదటి వారంలో పగిడిద్దరాజు జాతర ఎంతో అట్టహాసంగా జరగనుంది
