ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్‌లో పాల్గొని మాట్లాడాడు. ‘మహాభారతం, స్టార్ వార్స్..రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’’ పుట్టింది’ అని నాగ్ అశ్విన్ అన్నారు. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుందన్నారు.