బాహుబలి’ చిత్రంలో ‘అవంతిక’ పాత్రలో నటించిన తమన్నా ఆకట్టుకున్నారు. దీనిపై తాజాగా నటి మాట్లాడుతూ. ‘బాహుబలి వంటి గొప్ప చిత్రంలో రాజమౌళి నాకు అవంతిక పాత్ర ఇచ్చారు. దీంతో నటిగా నిరూపించుకోవడానికి నాకు అవకాశం లభించింది. నన్నే ఎంపిక చేయడానికి కారణమేమిటని దర్శకుడిని ఎన్నోసార్లు అడిగాను. ఆయన ఎప్పుడూ సమాధానమివ్వలేదు. ఆ ప్రశ్న అడిగిన ప్రతిసారీ నవ్వుతూ వెళ్లేవారు’ అని చెప్పుకొచ్చారు.