భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్రప్రభుత్వ అలసత్వంపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకు వేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారిణులతో శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.