ప్రపంచ శాంతికి పునాది వంటి మానవ హక్కులపై ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగో, గాజా, మయన్మార్, ఉక్రెయిన్, సుడాన్ వంటి ప్రాంతాల్లో కొనసాగుతోన్న పోరాటాలు అంతర్జాతీయ చట్టానికి ‘గుడ్డికన్ను’గా మారుతున్నాయన్నారు. ప్రపంచంలో రోజురోజుకు రక్షణ కరువవుతోందని హెచ్చరించారు. మానవ హక్కులకు, ప్రపంచ శాంతికి అత్యంత గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు