చంద్రుడిపై జపాన్ స్పేస్ ఏజెన్సీ స్లిమ్ అనే రోవర్‌ను దించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోవర్ రాత్రిని తట్టుకొని నిలిచింది. ఈ విషయాన్ని జాక్నావెల్లడించింది. ‘నిన్న రాత్రి స్లిమ్‌కు ఒక కమాండ్ పంపించగా, దానికి స్పందన వచ్చింది. అది రాత్రి వేళ కూడా కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కాపాడుకున్నట్లైంది’ అని పేర్కొంది. జపాన్ స్లిమ్‌ను జనవరిలో ల్యాండ్ చేసింది. ఇప్పటివరకు ఈరోవర్ 10 శిలలను పరిశోధించింది.