భారత్‌లో పేదరికం 5 శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని నీతి ఆయోగ్ చేపట్టిన సర్వే తెలిపింది. 2011-12 నుంచి పోల్చి చూస్తే పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5 శాతం పెరిగి రూ.3,510గా ఉందని, గ్రామాల్లో 40.42శాతం పెరిగి రూ.2,008గా ఉందని స్పష్టం చేసింది.