- సర్కార్ కొలువుల కన్నా పశువులు కాసుడు మిన్న.
- పాడి పశువులతోనే అధిక లాభాo.
- పాడి గేదకు 450. పేయ్యకు 350. పండగ సాదరా 100. రూపాయలు.
- నెలకు పశువులను బట్టి లక్ష రూపాయలు సంపాదించవచ్చు అంటున్న పశువుల కాపరులు.
- సర్కార్ ఉద్యోగుల జీతభత్యాల కన్నా పశువుల కాపర్లకు వచ్చే జీతమే ఎక్కువ.
- నామూసి పడవలసిన అవసరం లేదు అంటున్న పశువుల కాపర్లు.
మన్యం న్యూస్ నూగూరు వెంకటాపురం.
పూర్వం మన పూర్వీకులు జీవన విధానాన్ని పశువులతో కలగలిపిన జీవితాన్ని జీవించేవారు. పశు సంపదను వ్యవసాయాన్ని కూడా వారి జీవితంలో ఒక భాగంగా అనుకుని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. సమయానికి గడ్డి తౌడు నూకలు వంటి దాన అందించేవారు, తద్వారా వాటి నుండి వచ్చే పాలు అమ్ముతూ జీవన సాగించేవారు. అయితే
సాంప్రదాయ వ్యవసాయం రానురాను యంత్రికరణం అవుతున్న రోజులు ఇవి, కొంత మేరకు అయ్యాయి కూడా, ఆధునీకరణతో వచ్చిన యంత్రాలు సంస్కృతికపరంగా అనేక మార్పులు తీసుకొచ్చాయి. అయినా,ఆప్యాయతకు అనురాగానికి ఆనందానికి పల్లెలే పట్టుగొమ్ములు అనే మాటకు అర్థం లేకుండా పోతుంది, 1950 1965 వరకు రైతులు రైతు కూలీలు మొదలగు పల్లె వాసులు పంటలు పండించే విధానం పశువుల్ని కాసే విధానం వారు వాడిన పరికరాలు పనిముట్లు రాను రాను కనుమరుగవుతున్నవి అని చెప్పొచ్చు. పశువులతో మైత్రి వాటి కాపుదల అనేది చాలావరకు దూరమైందనే చెప్పాలి. నేటితరం వారు ప్రత్యక్షంగా పశువులను కాయాలన్నా, మరియు పూర్వికులు వాడిన వ్యవసాయ పనిముట్లను, చూడాలన్న రాను రాను అంత సులభం కాదు కాబోలు. సర్కార్ కొలువులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటూ దేశ విదేశాలు తిరిగే ఇప్పుడు ఉన్న యువత, బాధ్యత వహించాల్సిన వ్యవసాయం వైపు వారికున్న పశువు సంపద వైపు మొగ్గు చూపకపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమే. ఈ విషయం పట్ల వెంకటాపురం మండలం నాయకులగూడెం గ్రామానికి చెందిన కోకిల సడా లు, అనే పశువుల కాపరి పశువుల వల్ల వచ్చే లాభం పశువులు కాయడం వల్ల వచ్చే ఆనందం ఎంతుంటుందో ఈ విధంగా తెలిపారు. గవర్నమెంట్ కొలువుల కన్నా పశువులు కాసుడే మంచిది అని ఉరుకులు పరుగులు పెడుతున్న నేటి యువతకు చెంపపెట్టుల పశు సంపద గురించి ఈ విధంగా అభివర్ణించాడు.పశువులు మానవాళికి ఎంతో స్నేహితులు అని, అది తిన్నా తినకపోయినా ఎంతో విశ్వాసం చూపిస్తాయని, దానికి సంబంధించిన ఉలవలు దాన, పచ్చగడ్డి, నూకలతో కూడిన తవుడు ను ఆహారంగా అందిస్తే రోజుకు 5 నుండి 10 లీటర్ల పాలిస్తాయి అంటూ లీటర్ పాలు ఇప్పుడు 60 రూపాయలు ఉండగా రాను రాను 100 రూపాయలు అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ ఆయన తెలిపారు, సొంత పశువులను కాసుకొని ఆరోగ్యమైన పాలు తాగే బదులుగా విలాసాలకు పోయి కెమికల్ పాలు తాగుతూ నేటి యువత ఆరోగ్యాలు ఖరాబు చేసుకుంటున్నారు,. అని పశువుల కాపరి తెలిపాడు.నేడు లీటర్ పాలకు వంద రూపాయలు అయినప్పుడు 10 లీటర్లకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు అని. ఈ మూలంగానే పూర్వీకులు పశువు సంపదకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారని. తద్వారా కుటుంబాన్ని పోషించుకునేవారని ఆయన తెలిపాడు. రాను రాను పశువులు కాయలంట్టే నేటి యువత నామోషీగా ఫీల్ అవుతున్నారు అని పశువులు కాయడం అనేది ఉద్యోగం చేసినంత నరకం అయితే కాదు అని గవర్నమెంట్ నౌకరి నెల రోజుల్లో పది రోజులు చేయకపోయినా ప్రభుత్వం చేసిన 20 రోజులకే డబ్బులు కట్టిస్తారు అని అదే పశువులు
కాయడం అయితే . ఒకరి దగ్గర చేయాల్సిన అవసరం ఉండదు, ఒకరి కాళ్లు పట్టుకొని రికమండేషన్లు కూడా అవసరం లేదు అంటూ కొలువుల కోసం దేశ విశేషాలు తిరిగే యువతకు చురకలంట్టిచ్చాడు. ఎవరు గేదెలు వాళ్ళు కాసుకోవడం కూడా బరువైపోతున్న ఈ రోజుల్లో పశువులు కాపులో ఉన్నంత లాభం గవర్నమెంట్ కొలువులలో లేదు అని గేదకు 450 రూపాయలు, పేయ్యకు 350 రూపాయలు, పండగ సోదరా వంద రూపాయలు, మొత్తం మీద ఒక గేదకు నెలకు 1000 రూపాయలు సుమారుగా సంపాదించవచ్చు అని అంటే నెలకు 100 పశువులను కాస్తే వచ్చే ఆదాయం లక్ష రూపాయలు ఆడుతూ పాడుతూ సంపాదించవచ్చని తెలిపారు. ఇప్పుడున్న యువత వారి గేదెలు వారు కాసుకోవడానికి సిగ్గుపడుతున్న ఈ రోజుల్లో దీనిలో ఉన్న ఆదాయం గుర్తించడం లేదంటూ వారు వ్యాఖ్యానించారు. సిగ్గు పడాల్సిన అవసరం పశువులు కాయడంలో కాదు కొలువుల కోసం ఒకరి కాళ్లు పట్టుకోవడం అని తెలిపారు. దేశ విదేశాలు తిరుగుతూ గుట్కాలు తంబాకు మందులు పబ్బులని క్లబ్బులని ఆనంద వెతుక్కుంటూ పోతున్న యువత, ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఇంటికి చేరవలసిందేనని, సర్కార్ కొలువు ఉన్నా లేకపోయినా మన పశువులు మన భూములు మనతోనే ఉంటాయి కాబట్టి ఎన్ని చదువులు చదువుకున్న మన వ్యవసాయం మన పశువులు మనమే కాసుకుంటే సర్కార్ కొలువుతోఅవసరం ఉండబోదు అని ఈ సందర్భంగా తెలిపాడు. చదువుకుంటూ కూడా పశువులకు కాస్తే. అవి బతికి మనల్ని బతికిస్తాయి అని . మానవ మనుగడ ఇంకా అభివృద్ధి చెందాలంటే పశు పక్షాదులు కూడా మనతోపాటు జీవించాలి అని ఈ సందర్భంగా తెలిపారు.