మన్యం న్యూస్ గుండాల: గుండాల పోలీస్ స్టేషన్ ను కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. అనంతరం సిబ్బందితో ప్రత్యేక సమావేశమై స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయాల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్ర భాను, గుండాల సీఐ రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
