తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, శకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో నటించారు.
